For Money

Business News

ఇళ్ళ ధరలు పెరిగాయ్‌

దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ళు, ఫ్లాట్ల ధరలు పెరిగాయి. గిరాకీ పెరగడంతో పాటు ముడి పదార్థాల వ్యయం పెరగడమే దీనికి కారణమని క్రెడాయ్‌ కొల్లీర్స్‌, లియాజెస్‌ ఫోరాస్‌ సంస్థలు సంయుక్తంగా జరిపిన సర్వేలో వెల్లడైంది. హైదరాబాద్‌సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో నిరుడుతో పోల్చితే ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ళ ధరలు బాగా పెరిగాయి. గత ఏడాది జనవరి-మార్చితో పోలిస్తే ఈ ఏడాది ఇదే కాలంలో హౌజింగ్‌ ధరలు సైతం 11 శాతం వరకు పెరిగాయి. ధరలపరంగా ఈ 8 నగరాల్లో 9 శాతం పెరుగుదలతో హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉన్నది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ 11 శాతంతో ఇతర నగరాలకన్నా ముందుంది. నిరుడుతో పోల్చితే చదరపు అడుగు ధరల్లో పెరుగుదలకు సంబంధించి ఢిల్లీ తర్వాత రెండో స్థానంలో ఉండగా, చదరపు అడుగు ధర విషయంలో ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ తర్వాత నిలిచింది. ‘పెట్రో ధరలు తగ్గితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాణ రంగానికి ఎంతో ఊరటనివ్వగలదు. అలాగే ఉక్కు, సిమెంట్‌ తదితర ఉత్పత్తుల ధరలు తగ్గేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గడిచిన ఏడాదిన్నర కాలంగా ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నామ’ని క్రెడాయ్‌ అధ్యక్షుడు హర్షవర్ధన్‌ పటోడియా అన్నారు.