తగ్గనున్న సన్ఫ్లవర్ నూనె ధర
సోయా, సన్ఫ్లవర్ వంట నూనెల దిగుమతిపై అన్ని రకాల సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దిగుమతి చేసుకునే క్రూడ్ (శుద్ధి చేయని) సోయా, సన్ఫ్లవర్ నూనెలకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. సుంకంతో పాటు అగ్రికల్చర్ సెస్ పేరుతో విధిస్తున్న 5 శాతం ప్రత్యేక సెస్ కూడా ఈ ఎత్తివేసింది. ఈ మినహాయింపు రెండేళ్ళ పాటు అమల్లో ఉంటుంది. దీనివల్ల దేశంలో సోయా, సన్ఫ్లవర్ వంట నూనెల ధరలు స్వల్పంగా తగ్గే అవకాశముంది. ప్రస్తుతం శుద్ధి చేయని సోయా, సన్ఫ్లవర్ నూనెల దిగుమతిపై 5 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నారు. తాజా సుంకాల తగ్గింపుతో 2024 మార్చి వరకు మొత్తం 80 లక్షల టన్నుల ముడి సన్ఫ్లవర్, సోయాబీన్ నూనెలను సుంకాలు లేకుండా దిగు మతి చేసుకునే అవకాశం లభించనుంది. సుంకాల ఎత్తివేత కారణంగా లీటర్ సోయాబీన్ ధర రూ.3 వరకు తగ్గే అవకాశం ఉందని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా తెలిపారు.