For Money

Business News

సగానికి తగ్గిన గోధుమల సేకరణ

రైతుల నుంచి ప్రభుత్వం గోధుమల సేకరణ ప్రస్తుత మార్కెటింగ్‌ ఏడాదిలో 53 శాతం తగ్గింది. మార్కెటింగ్‌ సమయం ఏప్రిల్‌ నుంచి మార్చి వరకు ఉంటున్నా.. వాస్తవానికి జూన్‌తో ముగుస్తుంది. ప్రస్తుత ఏడాదిలో 195 లక్షల టన్నుల గోధుమలను మాత్రమే సేకరించాలని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయించింది. గత ఏడాది 444 లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్రం సేకరించింది. 22-23 ఏడాదికి ఇప్పటి వరకు ప్రభుత్వం 96 లక్షల టన్నుల గోధుమలను మాత్రమే ప్రభుత్వం సేకరించింది. గత ఏడాది ఇదే కాలానికి 132 లక్షల టన్నులు సేకరించింది.ప్రైవేట్‌ వ్యక్తులు అధిక ధర ఇవ్వడంతో రైతులు వారికే అమ్ముతున్నారు. కనీస మద్దతు ధరకు మాత్రం ఎఫ్‌ఐసీ ఇస్తుంది. ఎగుమతి అవకాశాలు ఉండటం, దేశీయంగా కూడా ధర బాగా ఉండటంతో ప్రైవేట్‌ వ్యక్తులు/కంపెనీలు రైతుల నుంచి నేరుగా గోధుమలను సేకరిస్తున్నారు.