హైదరాబాద్‌కు మీషో
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు నుంచి తెలంగాణకు మరో తీపి కబురు అందింది. ఈ కామర్స్ రంగంలో శరవేగంగా వృద్ధి కనబరుస్తోన్న మీషో సంస్థ తెలంగాణలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. హైదరాబాద్ నగరంలో ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా ఈ విషయం వెల్లడించారు. మీషో ఫౌండర్ ఆత్రేయతో మంత్రి కేటీఆర్ జరిపిన చర్చలు ఫలవంతం కావడంతో తెలంగాణలో పెట్టుబడులకు మీషో ఒకే చెప్పింది. హైదరాబాద్‌లో ఫెసిలిటీ సెంటర్‌తో పాటు టైర్ టూ సిటీస్‌లో ఆన్‌బోర్డ్ రిటైల్ సెల్లర్స్‌గా వ్యవహరించనుంది. టైర్ 2 సిటీస్‌లో ఉన్న ఐటీ హబ్స్, టీశాట్ సెంటర్లను ఈ మేరకు మీషో ఉపయోగించుకుంటుంది.