For Money

Business News

మార్కెట్‌లో కొనసాగుతున్న ర్యాలీ

స్టాక్‌ మార్కెట్‌లో ర్యాలీ కొనసాగుతోంది. ఉదయం ఆకర్షణీయ లాభాల్లో ప్రారంభమైన నిఫ్టి వెంటనే నష్టాల్లోకి జారుకుని 16207ని తాకింది. కాని అక్కడి నుంచి కోలుకుని ఇవాళ్టి ప్రతిఘటన స్థాయి 16400 దాకా వెళ్ళింది. 16393ని తాకిన నిఫ్టి మిడ్‌సెషన్‌లో స్వల్పంగా తగ్గి 16370 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 104 పాయింట్లు పెరిగింది. మిడ్‌సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లన్నీ లాభాల్లో ఉన్నాయి. కీలక సూచీలు ఒక శాతం కంటే అధిక లాభంతో ఉన్నాయి. దీంతో నిఫ్టి మళ్ళీ కోలుకునే అవకాశాలు ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ ఒక శాతం వరకు లాభంతో ఉండటం మరో కారణం. పెట్రోల్‌,డీజిల్ ధరలు తగ్గించినందున ఆటోమొబైల్‌ కంపెనీలతో పాటు… వీటిని ముడిపదార్థంగా వాడే ఏషియన్‌ పెయింట్స్‌, హిందుస్థాన్‌ లీవర్‌ కంపెనీల షేర్లు కూడా బాగా లాభపడ్డాయి. ఇక స్టీల్‌ ఎగుమతులపై ఆంక్షలు విధిచండంతో స్టీల్‌తో పాటు ఇవతర మెటల్స్‌ షేర్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు పది శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి.