16300పైన ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 16300 స్థాయిని దాటింది. 16349 పాయింట్లను తాకిన తరవాత ఇపుడు 16329 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 92 పాయింట్లు లాభపడింది. నిఫ్టి కేవలం 0.45 శాతం పెరగ్గా, నిఫ్టి మిడ్ క్యాప్ సూచీ ఏకంగా 1.4 శాతం లాభపడింది. నిఫ్టి బ్యాంక్ కూడా 0.72 శాతం పెరగడం విశేషం. ఊహించినట్లే ఆటో షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలబడగా, స్టీల్ షేర్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. మారుతీ, హీరో మోటొకార్ప్, ఎం అండ్ ఎం, టాటా మోటార్స్ టాప్ 5 టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి. ఇక నష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్లలో టాటా స్టీల్ టాప్ లూజర్‌గా నిలిచింది. ఈ షేర్‌తో పాటు జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు పది శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. స్టీల్ రంగంతో సంబంధం లేకున్నా మెటల్స్ కూడా పడుతున్నాయి. సెయిల్, ఎన్‌ఎండీసీ షేర్లు కూడా పది శాతం దాకా నష్టపోయాయి. హిందాల్కో, వేదాంత షేర్లు 5.5 శాతం నష్టపోయాయి. దాదాపు అదానీ గ్రూప్ షేర్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి.