టీసీఎస్ ఫలితాలు ఓకే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఐదు శాతం వృద్ధి సాధించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో టీసీఎస్ రూ.9,478 కోట్ల నికర లాభం నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో నికర లాభం రూ.9,008 కోట్లు. మార్కెట్ విశ్లేషకులు మాత్రం కంపెనీ రూ. 9910 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి. కన్సాలిటెడ్ రెవెన్యూ 16.2 శాతం పెరిగి రూ.52,758 కోట్లకు చేరింది. గతేడాది ఇది రూ.45,411 కోట్లు. జూన్ త్రైమాసికంలో ఎబిటా మార్జిన్ 23.1 శాతం. అదే మార్చి నెలాఖరుతో ముగిసిన త్రైమాసికంలో 25 శాతం, గతేడాది తొలి త్రైమాసికంలో 25.5 శాతం ఎబిటా మార్జిన్‌ను కంపెనీ సాధించింది. వాటాదారులకు ఒక్కో షేర్‌పై రూ.8 తాత్కాలిక డివిడెండ్ ప్రకటించింది. ఈ త్రైమాసికంలో 14,136 మందిని కొత్తగా ఉద్యోగంలోకి తీసుకున్నారు. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,06,331 మందికి చేరింది. కంపెనీ నుంచి వైదొలగుతున్న వారు 19.7 శాతంగా పేర్కొంది.