నిఫ్టి 17,800 దాటితేనే…
మార్కెట్ గట్టి బ్రేకౌట్ రావాలంటే నిఫ్టి 17800 స్థాయిని పటిష్ఠంగా దాటాల్సి ఉందని మెజారిటీ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్లతో పాటు దేశీయ ఇన్వెస్టర్లు కూడా కొనుగోళ్ళు చేస్తున్నందున… నిఫ్టిని వెంటనే కొనుగోలు చేయకపోయినా… షార్ట్ మాత్రం చేయొద్దని అంటున్నారు. నిఫ్టికి 17800 వద్ద తీవ్ర ప్రతిఘటన ఎదురు అవుతోందని.. ఈ స్థాయిని దాటితే నిఫ్టి 18000 స్థాయిని దాటుతుందని ఏంజిల్ వన్ బ్రోకరేజీ సంస్థకు చెందిన అనలిస్ట్ సమీత్ చవాన్ అంటున్నారు. నిఫ్టి గనుక పడితే 17600 లేదా17500 మద్దతు అందే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతానికి కన్సాలిడేషన్ దశలో ఉందన్నారు. 5 పైసా డాట్ కామ్ చెందిన అనలిస్ట్ రుచిత్ జైన్ మాత్రం ఇన్వెస్టర్లు దూకుడుగా వెళ్ళొద్దని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే 17800 కాల్ రైటింగ్ చాలా జోరుగా ఉందని అంటున్నారు. అంటే ఈ స్థాయి దాటడం కష్టం. అలాగే 17500 వద్ద పుట్ రైటింగ్ అధికంగా ఉన్నందున…ఈ స్థాయిలో నిఫ్టికి మద్దతు ఉంటుందని అంటున్నారు. బుధవారం నాటికి నిఫ్టికి 17573 లేదా 17491 కీలక మద్దతు స్థాయిలుగా ఉంటాయని… పెరిగితే తొలి అవరోధం 17750 వద్ద, రెండో అవరోధం 17845 వద్ద ఎదురు అవుతుందని అంటున్నారు.