For Money

Business News

15,600పైన ప్రారంభం కానున్న నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు నిన్న కూడా నిస్తేజంగా ముగిశాయి. యూరో మార్కెట్లు ఒక మోస్తరు లాభాలకు పరిమిత కాగా, అమెరికా మార్కెట్లు నామ మాత్రపు లాభాలతో ముగిశాయి. దాదాపు లాభాలు లేవని చెప్పాయి. ఇక ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. ప్రధాన సూచీలన్నీ దాదాపు అర శాతం లాభంతో ఉన్నాయి. విచిత్రమేమిటంటే డాలర్‌, బులియన్‌, క్రూడ్‌ కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 90 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టి కూడా 15,600పైన ప్రారంభం కానుంది. మరి నిఫ్టి ఏ స్థాయిలో ట్రేడవుతుందనేది నిఫ్టి డే ట్రేడింగ్‌ వ్యూహంలో చూడగలరు.