For Money

Business News

15,600పైన ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి దారిలోనే నిఫ్టి ఓపెనైంది. 15,630 పాయింట్లను తాకిన తరవాత ప్రస్తుతం 30 పాయింట్ల లాభంతో 15,613 పాయింట్ల వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. మిడ్‌ క్యాప్‌ నిఫ్టి అర శాతం దాకా లాభపడం విశేషం. మార్కెట్‌ ప్రారంభ సమయానికి మే నెలలో ఆటో వాహనాల అమ్మకాల డేటా వచ్చింది. ముఖ్యంగా బజాజ్‌ ఆటో అమ్మకాలు ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో ఇవాళ టాప్‌ గెయినర్స్‌లో చాలా వరకు ఆటో షేర్లు నిలిచాయి. బ్యాంక్‌ నిఫ్టి స్థిరంగా ఉంది. ప్రైవేట్‌ బ్యాంకుల్లో కాస్త కదలిక ఉంది. ఇక అమ్మకాల్లో మెటల్‌ షేర్లు ముందున్నాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన ఐసీఐసీఐ బ్యాంక్‌లో లాభాల స్వీకరణ కన్పిస్తోంది. దిగువ స్థాయిలో ఈ షేర్‌కు మద్దతు లభిస్తుందేమో చూడాలి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
బజాజ్‌ ఆటో 4,318.15 2.99
ఓఎన్‌జీసీ 115.50 1.63
హీరో మోటో కార్ప్‌ 3,048.25 1.35
టాటా మోటార్స్‌ 323.00 1.33
హెచ్‌డీఎఫ్‌సీ 2,583.20 1.19

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
టాటా స్టీల్‌ 1,110.75 -1.32
JSW స్టీల్‌ 703.90 -0.98
ఏషియన్‌ పెయింట్స్‌ 2,952.65 -0.83
అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 6,652.05 -0.83
ఐసీఐసీఐ బ్యాంక్‌ 659.25 -0.53