ఎన్సీసీ లాభంలో స్వల్ప వృద్ధి
సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి ఎన్సీసీ ఏకీకృత ప్రాతిపదికన రూ.131 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన లాభం రూ.114 కోట్లతో పోలిస్తే 15 శాతం పెరిగింది. ఇదే కాలంలో కంపెనీ టర్నోవర్ రూ.2,601 కోట్ల నుంచి రూ.3,405 కోట్లకు చేరింది. ప్రథమార్ధం మొత్తానికి చూస్తే రూ.6,756 కోట్ల టర్నోవర్‌పై రూ.261 కోట్ల లాభాన్ని ఆర్జించింది. క్యూ2లో కంపెనీకి లో రూ.2,661 కోట్ల ఆర్డర్లు లభించగా.. సెప్టెంబరు 30 నాటికి చేతిలో రూ.40,020 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.