For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు డల్‌గా ఉన్నాయి. మొన్న నాస్‌డాక్‌ రెండు శాతం నష్టపోగా నిన్న స్వల్ప నష్టాలకు పరిమితమైంది. మొన్న నామ మాత్రపు నష్టాలు పొందిన ఎస్‌ అండ్‌ పీ 500 రాత్రి 0.87 శాతం క్షీణించింది. మొన్న ఆల్‌టైమ్‌ హైని తాకిన డౌజోన్స్‌ రాత్రి 1.36 శాతం క్షీణించింది. నిన్న భారీగా క్షీణించిన ఆసియా మార్కెట్లు ఇవాళ మిశ్రమంగా ఉన్నాయి. లాభాలు నష్టాలు నామమాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి స్వల్ప నష్టంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా లేదా నష్టాల్లో ప్రారంభమయ్యే అవకాశముంది. మద్దతు స్థాయిలో కొనుగోలు చేయడం, ప్రతిఘటన స్థాయిలో అమ్మడం రివాజుగా మారింది మార్కెట్‌లో ఇవాళ నిఫ్టి క్షీణించే పక్షంలో 14,760 వద్ద మద్దతు అందుతుందేమో చూడాలి.