For Money

Business News

రూ. 21,000 కోట్లకు పేటీఎం ఐపీఓ

దేశంలో ఇప్పటి వరకు ఏ కంపెనీ సమీకరించని స్థాయిలో ఏకంగా రూ. 21,000 కోట్లను మార్కెట్‌ నుంచి సమీకరిచేందుకు పేటీఎం సిద్ధమౌతోంది. పేటీఎంలో చైనాకు చెందిన రెండు ప్రధాన కంపెనీలు ఉన్నాయి. దీనివల్ల పేటీఎంకు పలు అమెరికా కంపెనీల నుంచి ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో ఈ రెండు కంపెనీలు పేటీఎం నుంచి వైదొలగడానికి పేటీఎం పబ్లిక్‌ ఆఫర్‌ చేయనుంది. పేటీఎంలో విజయ్‌ శేఖర్‌ వర్మకు 14 శాతం, అలీబాబా అనుబంధ సంస్థ అయిన యాంట్‌ ఫైనాన్షియల్స్‌కు 29.7 శాతం, సాఫ్ట్‌ బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌కు 19.6 శాతం, సెయిఫ్‌ పార్టనర్స్‌కు 18.5 శాతం వాటా ఉండగా, నేరుగా ఆలీబాబాకు 7.4 శాతం వాటా ఉంది. అలీబాబా, యాంట్‌ ఫైనాన్షియల్స్‌ తమ 37 శాతా వాటాను ఐపీఓలో విక్రయిస్తాయి. టెక్‌ కంపెనీలు మార్కెట్‌లో చాలా తక్కువగా ఉన్నందున పేటీఎంకు మార్కెట్‌లో విశేష ఆదరణ లభిస్తుందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. అయితే పేటీఎం ప్రీమియం ఎంత వసూలు చేస్తుందో చూడాలి?