For Money

Business News

చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌

ఆరోగ్య రంగానికి చెందిన సంస్థలతో పాటు మధ్య చిన్న తరగతి పరిశ్రమలకు అనేక వెసులుబాట్లను ఎస్‌బీఐ, ఐబీఏ (ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌)లు ప్రకటించాయి. ఆన్‌సైట్‌లో ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసే హాస్సిటల్స్‌ లేదా నర్సింగ్‌ హోమ్‌లు పెట్టాలనుకునే వారికి రూ. 2 కోట్ల వరకు రుణానికి ప్రభుత్వం వంద గ్యారంటీ ఇస్తుందని ఎస్‌బీఐ పేర్కొంది. పైగా ఈ రుణాలపై కేవలం 7.5 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేస్తారు.చిన్న, మధ్య తరహా రంగానికి చెందిన పరిశ్రమలకు ఇపుడున్న రుణాల పునర్‌వ్యవస్థీకరణకు కొత్త మార్గదర్శకాలను ఇవాళ విడుదల చేశారు. ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ స్కీమ్‌ (ECLGS)ను సెప్టెంబర్‌ వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నాల్గవ విడదత స్కీమ్‌లో రూ. 3 లక్షల కోట్లను ఇస్తున్నట్లు వెల్లడించింది. ECLGS లోన్లను పునర్‌ వ్యవస్థీకరించదలచిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు 5ఏళ్ళ వరకు తమ రుణాలను పునర్‌ వ్యవస్థీకరించే వెసులుబాటు కల్గించింది.ఈ ఏడాది డిసెంబర్‌ చివరి వరకు ఈ స్కీమ్‌ కింద రుణాలను మంజూరు చేస్తామని పేర్కొంది. మొత్తం మూడు రకాలుగా వ్యాపారాలను వర్గకరించి రుణాలను పునర్‌ వ్యవస్థీకరిస్తారు. రూ. 10 లక్షలలోపు రుణాలకైతే ఎలాంటి ఇబ్బందులకు లేకుండా ఒక ప్రామానిక పద్దతిని పెట్టారు. ఆ ప్రకారం పునర్‌ వ్యవస్థీకరిస్తారు.