For Money

Business News

ప్యాక్స్‌లోవిడ్‌’ జనరిక్‌ మందు తయారీకి అనుమతి

‘కోవిడ్‌ చికిత్స కోసం ఇపుడు వాడుతున్న ప్యాక్స్‌లోవిడ్‌కు జనరిక్‌ వెర్షన్‌ తయారు చేసేందుకు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌ (CDSCO) నుంచి హైదరాబాద్‌కు చెందిన జెనెరా ఫార్మా అనుమతి పొందింది. బయోఫోర్‌ ఇండియా ఫార్మాస్యూటికల్స్‌ అనుబంధ సంస్థే ఈ కంపెని. కోవిడ్ చికిత్స కోసం నిర్మాట్రెల్‌విర్‌, రిటొనవిర్‌ (Nirmatrelvir and Ritonavir) ట్యాబ్లెట్లను వాడుతారు. ఈ ట్యాబ్లెట్లను ఫైజర్‌ కంపెనీ తయారు చేసి ప్యాక్స్‌లోవిడ్‌ పేరుతో మార్కెట్‌ చేస్తోంది. ఈ కంపెనీకి 2021 డిసెంబర్‌లో అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చింది. ఇదే మందు జనరిక్‌ వెర్షన్‌ను తాము ‘ప్యాక్స్‌జెన్‌’ పేరుతో తయారు చేసి మార్కెట్‌ చేయున్నట్లు జనెరా ఫార్మా సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్‌ డాక్టర్‌ జగదీష్‌ బాబు రంగిశెట్టి తెలిపారు. ఈ మందు తయారు చేసేందుకు తాము ఇతర కంపెనీలపై ఆధారపడమని… దీనికి సంబంధించిన అన్ని ముడి పదార్థాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు. ఈ కంపెనీకి హైదరాబాద్‌లో అమెరికా ఎఫ్‌డీఐ ఆమోదం పొందిన ప్లాంట్‌ ఉంది. అందులోనే వీటిని తయారు చేయనున్నట్లు కంపెనీ సీఈఓ డాక్టర్‌ శ్రీనివాస్‌ ఆరుట్ల తెలిపారు.