For Money

Business News

నిఫ్టి సూపర్‌ క్లోజింగ్‌: డే ట్రేడర్లకు పండుగ

ఇవాళ కూడా డే ట్రేడర్లకు నిఫ్టి చక్కటి లాభాలను అందించింది. నిఫ్టి కూడా ఆల్గో లెక్కల ప్రకారం సరిగ్గా 15,761 పాయింట్లకు చేరగానే అమ్మకాల ఒత్తిడికి గురైంది. అర గంటలోనే నష్టాల్లోకి చేరుకున్న నిఫ్టి తరవాత ఒక్కో మద్దతు స్థాయిని కోల్పోతూ వచ్చింది. డే ట్రేడర్స్‌కు అత్యంత కీలకంగా భావిస్తూ వచ్చిన 15600 తరవాత 15,559, 15,453 స్థాయిలను తాకింది. 15,450 వద్ద అందిన మద్దతుతో నిఫ్టి కోలుకుంది. మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు కూడా స్థిరంగా ఉండటంతో ట్రేడింగ్‌ క్లోజింగ్‌కు ముందు లాభాల్లో వచ్చింది. చివర్లో 8 పాయింట్లు నష్టపోయి… 15,683 వద్ద ముగిసింది. ఎక్కడ ప్రారంభమైందో… అక్కడే ముగిసిందన్నమాట. కాని డే ట్రేడర్లు మాత్రం భారీగా లాభాలు పొందారు. ఎందుకంటే ఇవాళ గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల మధ్య వ్యత్యాసం 300 పాయింట్లు ఉండటం. ఇవాళ భారీగా నష్టపోయింది మాత్రం మిడ్‌ క్యాప్‌ సూచీ. ఒకదశలో రెండున్నర శాతం క్షీణించిన ఈ సూచీ తరవాత కోలుకుని ఒక శాతం నష్టంతో ముగిసింది. బ్యాంకు నిఫ్టి కోలుకుంది. చాలా రోజుల తరవాత అదానీ పోర్ట్స్‌ 7 శాతం లాభంతో టాప్‌ గెయినర్‌గా నిలిచింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
అదానీ పోర్ట్స్‌ 693.15 7.15
బజాజ్‌ ఆటో 4,177.10 3.04
హిందుస్థాన్‌ లీవర్‌ 2,490.25 3.00
భారతీ ఎయిర్‌టెల్‌ 540.55 2.25
గ్రాసిం 1,487.05 1.98

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఓఎన్‌జీసీ 120.75 -3.48
కోల్‌ ఇండియా 147.00 -3.38
JSW స్టీల్‌ 673.40 -3.30
ఎన్‌టీపీసీ 113.70 -3.15
యూపీఎల్‌ 810.65 -2.92