For Money

Business News

నిఫ్టి… దూరంగా ఉండటమే బెటర్‌

ఇవాళ ఈ నెల చివరి గురువారం. ప్రస్తుత నెల డెరివేటివ్స్‌తో పాటు వారాపు డెరివేటివ్స్‌కు నేడు క్లోజింగ్‌. అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు దేశీయ పరిస్థితులను చూస్తే … మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు పెద్దగా లేవు. అయితే డెరివేటివ్స్‌ క్లోజింగ్స్‌ కారణంగా నిఫ్టిలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు లేదా ఫ్లాట్‌గా ఉండొచ్చు. చిన్న ఇన్వెస్టర్లు ఇవాళ్టికి ఓపెనింగ్‌లో లాభాలను స్వీకరించి మార్కెట్‌కు దూరంగా ఉండటమే బెటర్‌. రేపు తాజాగా పొజిషన్స్‌ తీసుకునే అంశాన్ని పరిశీలించవచ్చు. పెద్ద ఇన్వెస్టర్లు నిఫ్టి పడుతుందేమో చూడండి. పొజిషనల్‌ ట్రేడ్‌ కోసం నిఫ్టి గనుక 15,200 ప్రాంతానికి వస్తే కొనుగోలు చేయొచ్చు. 15100 స్టాప్‌లాస్‌. ఇది కేవలం పొజిషనల్‌ ట్రేడింగ్‌ కోసం. డే ట్రేడింగ్‌ కాదు.