For Money

Business News

నిఫ్టి ఇక పెరగడం కాస్త కష్టమే!

స్టాక్‌ మార్కెట్‌ స్థిరంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 15,778ని తాకిన నిఫ్టి ఇపుడు 15,764 పాయింట్ల వద్ద 12 పాయింట్ల లాభం వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి 28 షేర్లు లాభంతో 21 షేర్లు నష్టంతో ట్రేడవుతున్నాయి. బ్యాంక్‌ నిఫ్టిలో ఉత్సాహం పోతోంది. ఇక నుంచి పెరగడంతో ఈ సూచీకి కష్టంగా మారింది. దాదాపు ప్రధాన బ్యాంక్‌ ఫలితాలు వచ్చేశాయి. బ్యాంక్‌ నిఫ్టి ముందుకు తీసుకెళ్ళే అంశాలు దాదాపు లేవు. దీంతో నిఫ్టి స్పీడు కూడా తగ్గుతోంది. మిడ్ క్యాప్‌ షేర్లలో కాస్త యాక్టివిటీ ఉంది. ఈ సూచీలోని షేర్లలోనే ట్రేడిండ్‌ కాస్త మెరుగ్గా ఉంది. ఇక లార్జ్‌ క్యాప్స్‌లో ఐటీ షేర్లు ఒక మోస్తరు లాభాలతో ఉన్నాయి. మరి ఇవి చివరి వరకు ఉంటాయా? లాభాల స్వీకరిస్తారా అన్నది చూడాలి. నిఫ్టిలో ట్రేడ్‌కు పెద్ద అవకాశాలు లేవు. లేదా లెవల్స్‌ను బట్టి ట్రేడ్‌ చేసి స్వల్ప లాభాలతో బయటపడటమే.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఎన్‌టీపీసీ 118.00 1.37
టెక్‌ మహీంద్రా 1,046.40 1.16
విప్రో 554.45 1.13
ఇన్ఫోసిస్‌ 1,404.00 1.03
బజాజ్‌ ఫైనాన్స్‌ 5,787.35 1.01

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఎస్‌బీఐ లైఫ్‌ 973.35 -1.53
హిందాల్కో 390.10 -1.24
టాటా స్టీల్‌ 1,116.45 -1.09 8,22,912
శ్రీ సిమెంట్‌ 28,910.00 -0.84
JSW స్టీల్‌ 710.00 -0.80