For Money

Business News

నిఫ్టికి 15,660 వద్ద గట్టి ప్రతిఘటన

అంతర్జాతీయ మార్కెట్లు నిస్తేజంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లలో పెద్ద మార్పు లేదు. ఆసియా మార్కెట్లూ గ్రీన్‌లో ఉన్నమాటే గాని.. చెప్పుకోదగ్గ లాభాలు లేవు. మన మార్కెట్లలో కూడా నిఫ్టి నిలబడుతోందే కాని…ముందుకు సాగడం కష్టంగా ఉంది. అయితే ఈ స్థాయిలో నిఫ్టి నిలదొక్కుకుందని.. ఇక్కడి నుంచి భారీగా లాభపడుతుందని అనలిస్టులు అంటున్నారు. అయితే విదేశీ ఇన్వెస్టర్లు సూచీలకన్నా.. మిడ్‌ క్యాప్‌ షేర్లలో ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టి ఓపెనింగ్‌లోనే 15,630 స్థాయిని దాటే అవకాశముంది. 15,652 నిఫ్టికి తొలి ప్రతిఘటనను ఎదుర్కోనుంది. రెండో, కీలక ప్రతిఘటన 15,668 ప్రాంతంలో ఉంది. నిఫ్టి ఆకర్షణీయ లాభంతో ప్రారంభం అవుతుంది కాబట్టి…కీలక స్థాయిలకు చేరుతుందేమో వెయిట్‌ చేయండి. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు 16,650 ప్రాంతంలో అమ్మొచ్చు. వీరు 15,668 స్టాప్‌లాస్‌తో ట్రేడ్‌ చేయండి. అధిక స్థాయి నుంచి నిఫ్టి ఏ మేరకు పడుతుందనేది వేచి చూడాల్సిందే. స్వల్ప లాభాలకే పరిమితం కావడం మంచిది. ఎందుకంటే కొనుగోలుకు ఛాన్స్‌ ఇస్తుందా అన్నది మిడ్‌ సెషన్‌లో తేలనుంది. ఏ కారణమైనా ఒకవేళ నిఫ్టి నష్టాల్లోకి జారుకుంటే 15,544 వద్ద మద్దతు లభించవచ్చు. తరువాతి మద్దతు 15,520. ఈస్థాయిల్లో కొనుగోలు చేయాలనుకునేవారు 15,500 స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
నిఫ్టి ఓవర్‌బాట్‌ పొజిషన్‌లో ఉన్నందున అధిక స్థాయిలో అమ్మడానికే ప్రాధాన్యం ఇవ్వండి.