For Money

Business News

నిఫ్టి: ఓపెనింగ్‌లోనే అమ్మకాల ఒత్తిడి

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా మన మార్కెట్లు ప్రారంభమయ్యాయి. నిఫ్టి ఓపెనింగ్‌లోనే అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. ఓపెనింగ్‌లో 14,225ని తాకిన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే 14,151ని తాకింది. నిఫ్టి దాదాపు ఒక శాతం క్షీణించిన తరవాత ప్రస్తుతం 14,208 వద్ద 88 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. స్టీల్‌, ఫార్మా…ఎంపిక చేసిన కొన్ని ఐటీ షేర్లకు మద్దతు లభించింది. నిఫ్టిలో 34 షేర్లు నష్టాల్లో ఉండగా, 16 షేర్లు లాభాల్లో ఉన్నాయి. కరోనా కేసుల సంఖ్య 3 లక్షలను దాటడంతో పాటు అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు మొగ్గు చూపడంతో… మార్కెట్‌ అనిశ్చితిలో పడింది. అంతర్జాతీయ మార్కెట్లు దూకుడుగా ఉన్నాయి… కాని దేశీయంగా పరిస్థితులు నిరాశాజనకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొనుగోళ్ళు చేయకపోయినా… అమ్మడానికి కూడా ఇన్వెస్టర్లు జంకుతున్నారు. మే రెండు లేదా మూడో నెలలో కరోనా కేసులు గరిష్ఠ స్థాయికి చేరుతాయన్న వార్తలతో కొందరు ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతానికి మెజారిటీ ఇన్వెస్టర్లు sell or rise అనే ఫార్ములాను పాలో అవుతోంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
టాటా స్టీల్‌ 916.00 2.46
డాక్టర్‌ రెడ్డీస్‌ 5,247.60 1.76
బీపీసీఎల్‌ 414.00 1.45
హిందాల్కో 364.20 1.35
సన్‌ ఫార్మా 653.70 1.33

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
శ్రీసిమెంట్‌ 28,405.05 -3.12
అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 6,017.75 -2.95
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 821.95 -2.73 ఏషియన్‌ పెయింట్స్‌ 2,498.65 -2.15
హీరో మోటోకార్ప్‌ 2,769.75 -1.91