For Money

Business News

క్రూడ్‌ 300 డాలర్లు అవుతుంది

తమ దేశం నుంచి చమురు, గ్యాస్‌ సరఫరాను నిలిపివేయాలనే దుస్సాహసం చేస్తే.. పాశ్చాత్య దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని రష్యా హెచ్చరించింది. అదే జరిగితే తాము రష్యా-జర్మనీ గ్యాస్‌ పైప్‌లైన్‌ను మూసివేస్తామని రష్యా డిప్యూటీ ప్రధాని అలెగ్జాండర్‌ నొవాక్ ఒక ప్రతికా ప్రకటనలో హెచ్చరించారు. తాము గ్యాస్‌ సరఫరా ఆపితే క్రూడ్‌కు మరింత డిమాండ్‌ పెరుగుతుందని… అపుడు బ్యారెల్‌ క్రూడ్‌ ధర 300 డాలర్లను దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని హెచ్చరించారు. తమ దేశం నుంచి కొనుగోలు చేస్తున్న క్రూడ్‌ స్థానంలో ఇతర దేశాల క్రూడ్‌ను తేవాలంటే కనీసం ఏడాది పడుతుందని నొవాక్‌ హెచ్చరించారు. దాని కోసం యూరప్‌ దేశాలు భారీ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుందన్నారు. ”మీరు మా దగ్గర నుంచి సరఫరా ఆపేస్తామంటే.. మాకు భయం లేదు. ఆపేయండి. మా దగ్గర ఉన్న ఆయిల్‌ను ఎక్కడికి సరఫరా చేయాలో మాకు తెలుసు”అని నొవాక్‌ హెచ్చరించారు. యూరప్‌ ఆయిల్, గ్యాస్‌ అవసరాల్లో 40 శాతం రష్యా తీరుస్తోంది.