For Money

Business News

వాల్‌స్ట్రీట్‌ ముంచేసింది

రాత్రి అమెరికా మార్కెట్లు ఇన్వెస్టర్లను నష్టాల్లో ముంచేశాయి.యూరో మార్కట్లు ఉన్నంత వరకు ఒక మోస్తరు నష్టాలతో ఉన్న వాల్‌స్ట్రీట్‌లో చివర్లో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నిన్న డాక్స్‌ నుంచి అనేక యూరో మార్కెట్లు నాలుగు శాతం వరకు నష్టపోయాయి. తరవాత కోలుకుని రెండు శాతం నష్టాల్లో ముగిశాయి. అప్పటి వరకు అమెరికా మార్కెట్లు ఒకటిన్నర శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. క్లోజింగ్‌ దగ్గర పడే కొద్దీ ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు పాల్పడ్డారు. ఇరాన్‌ ఆయిల్‌ సరఫరాకు అనుమతి ఇచ్చి… రష్యా ఆయిల్‌పై ఆంక్షలు విధించాలని అమెరికా భావిస్తోంది. అయితే రష్యాపై నిషేధం వల్ల నిలిచిపోయే ఆయిల్‌ స్థాయిలో ఇరాన్‌ సరఫరా చేయలేదు. దీంతో ఆయిల్‌ ధరలు ఇంకా పెరుగుతాయని, ద్రవ్యోల్బణం పట్టపగ్గాల్లేకుండా పెరుగుతుందని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు.రాత్రి ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ మూడు శాతం నష్టపోగా, డౌజోన్స్‌ 2.4 శాతం, నాస్‌డాక్‌ 3.6 శాతం చొప్పున నష్టపోయాయి.