52 వారాల గరిష్ఠ స్థాయికి
ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో షేర్ ఇవాళ 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకింది. ఇవాళ బీఎస్ఈలో ఈ షేర్ ధర రూ. 80ని తాకింది. గడచిన ఏడు ట్రేడింగ్ సెషన్స్‌లో ఈ షేర్ 17.5 శాతం పెరగడం విశేషం. ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూ సమయంలో తమ షేర్లను రూ. 76లకు జారీ చేసిన విషయం తెలిసిందే. రూ. 125 ప్రీమియంతో లిస్టయిన ఈ షేర్ తరవాత రూ. 169.10ని తాకింది. 2021 నవంబర్ 16వ తేదీన ఈ షేర్ ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిని తాకిన తరవాత 2022 జులై 27న రూ. 40.55లకు క్షీణించింది. అక్కడి నుంచి క్రమంగా కోలుకుంటూ డబుల్ అయింది. ప్రస్తుత ధర వద్ద కూడా చాలా మంది అనలిస్టులు ఈ షేర్‌ను అట్టిపెట్టుకోవాలని సూచిస్తున్నారు. కంపెనీ నష్టాలు తగ్గడమే దీనికి ప్రధాన కారణం. సో… ఇక్కడి నుంచి రూ. 100లకు ఈ షేర్ చాలా ఫాస్ట్‌గా చేరుతుందని భావిస్తున్నారు.