జొమాటొ 23 శాతం డౌన్
భారీ వ్యాల్యూయేషన్తో ఇటీవల స్టాక్ మార్కెట్లో ప్రవేశించిన షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. మొన్నటి దాకా చాలా పటిష్టంగా కన్పించిన జొమాటో షేర్ ధర పేకమేడలా కూలిపోయింది. ఏకంగా రూ. 169 నుంచి పడుతూ వచ్చిన ఈ షేర్ ఇవాళ 23 శాతం నష్టంతో ఏకంగా రూ. 90.95 వద్ద ముగిసింది.
నైకా కంపెనీ కూడా ఒకే రొజు15 శాతం పడటం… బహుశా లిస్టింగ్ తరవాత ఇదే మొదటిసారి. ఇవాళ 12.58 శాతం నష్టంతో ఈ షేర్ రూ.1745 వద్ద ముగిసింది. ఈ షేర్ క్రితం ముగింపు రూ. 1998.నవంబర్ 26న రూ.2573 పలికిన ఈ షేర్ క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఒకదశలో పేటీఎం రూ.881కు క్షీణించినా.. చివర్లో స్వల్పంగా కోలుకుని రూ. 916 వద్ద ముగిసింది. ఇంకా అనేక కొత్త షేర్లు భారీ నష్టాలతో ముగిశాయి.