అదరగొట్టిన జొమాటొ లిస్టింగ్
యువ ఇన్వెస్టర్ల పుణ్యమా అని ఇవాళ జొమాటొ భారీ లాభంతో ముగిసింది. యువ ఇన్వెస్టర్లు భారీ సంఖ్యలో జొమాటో పబ్లిక్ ఆఫర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. షేర్లు అలాట్కానీ ఇన్వెస్టర్లు ఇవాళ రెట్టించి ఉత్సాహంతో షేర్లు కొనేందుకు క్యూ కట్టారు. షేర్ లిస్టింగ్ ముందు జరిగిన ప్రి మార్కెటింగ్ లిస్టింగ్‌లో రూ. 115 ధర వద్ద కొనుగోలు చేసేందుకు దాదాపు నాలుగు కోట్ల షేర్లను ఇన్వెస్టర్లు వెయింటింగ్. తీరా లిస్టయిన తరవాత పోటాపోటీగా సాగిన కొనుగోళ్ళతో ఈ షేర్ ఇవాళ రూ.138.90 వరకు వెళ్ళింది. అంటే నష్టాల్లో ఉన్న ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్ల రూపాయలను దాటింది. కాని లిస్టింగ్‌లో షేర్లు పొందినవారిలో చాలా మంది అమ్ముకుంటూ వచ్చారు. అధిక ధర వద్ద అమ్మకాల ఒత్తిడి అధికం కావడంతో షేర్ రూ. 125.30 వద్ద ముగిసింది. ఈ షేర్ ఆఫర్ ధర రూ. 76. చాలా మంది సీనియర్ ఇన్వెస్టర్లు ఈ షేర్లను అమ్ముకున్నట్లే తెలుస్తోంది. ఎన్ఎస్ఈలో మొత్తం 66.66 కోట్ల షేర్లు ట్రేడైతే… డెలివరీ తీసుకుంది 62 శాతం మంది మాత్రమే. చివర్లో షేర్ ధర తగ్గడంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 98,300 కోట్లకు తగ్గింది. ఒక్క ఎన్ఎస్ఈలో ఇవాళ జొమాటొ కౌంటర్లో ట్రేడైన షేర్ల విలువ రూ. 8,625 కోట్లు.