కోటి దాటిన జీరోద కస్టమర్ల సంఖ్య
స్టాక్ మార్కెట్ బ్రోకింగ్ వ్యాపరంలో సంచలన మార్పులకు శ్రీకారం చుట్టిన జీరోదలో కస్టమర్ల సంఖ్య కోటీ దాటింది. జీరోద రాకముందు షేర్ మార్కెట్ ట్రేడింగ్ అత్యంత ఖరీదైన వ్యవహారంగా ఉండేది. బ్యాంకులు, ప్రముఖ బ్రోకింగ్ సంస్థల దోపిడీకి ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. కేవలం ఒక్కో ట్రేడ్ రూ. 20 అంటూ జీరోద ప్రారంభించిన ట్రేడింగ్ ఆఫర్‌తో చాలా తక్కువ కాలంలో ఇన్వెస్టర్లలో దూసుకుపోయింది. ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ చాలా సింపుల్, ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉండటంతో ఆన్లైన్ ట్రేడింగ్‌లో జసీరోద దూసుకుపోయింది. తరవాత అనేక సంస్థలు వచ్చినా.. జీరోద గట్టిగా నిలబడింది. ఈ మైలురాయి దాటేందుకు సహకరించిన ఇన్వెస్టర్లు, ప్రభుత్వం, సెబి, స్టాక్ ఎక్స్ఛేంజీలకు జీరోద అధినేత నితిన్ కామత్ ధన్యవాదాలు తెలిపారు.