జీ టీవీతో సోని ఒప్పందం?

జీ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ, సోని ఇండియా నెట్‌వర్క్ మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే రెండు కంపెనీల మధ్య నాన్ బైండింగ్ ఒప్పందం కుదిరినట్లు సీఎన్‌బీసీ టీవీ18 వెల్లడించింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ ఇండియా నెట్‌వర్క్ విలీనం కోసం ఈ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. విలీనం తరవాత జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు 47.07 శాతం వాటా ఉంటుందని, సోనీ ఇండియాకు 52.93 శాతం వాటా ఉంటుందని తెలుస్తోంది. పునీత్ గోయెంకా మరో అయిదేళ్ళ పాటు సీఈఓగా కొనసాగుతారు. అయితే ఈ నాన్ బైండింగ్ ఒప్పందం 90 రోజులు పాటు అమల్లో ఉంటుంది. కంపెనీ డైరెక్టర్లను సోని నిర్ణయిస్తుంది. మరి ఈ డీల్ 90 రోజుల్లో పూర్తి కావాల్సి ఉంటుంది.