For Money

Business News

హైదరాబాద్‌లో చేతక్‌ ఈ స్కూటర్‌

చేతక్‌ ఇ-స్కూటర్‌ను బజాజ్‌ ఆటో హైదరాబాద్‌ మార్కెట్‌లో ప్రవేశ పెట్టనుంది. ఈమేరకు ఆన్లైన్‌ బుకింగ్‌ ప్రారరంభించింది. చేతక్‌.కామ్‌ వెబ్‌సైట్లో రూ.2,000 చెల్లించి చేతక్‌ ఈ-స్కూటర్‌ను బుక్‌ చేసుకోవచ్చని బజాజ్‌ ఆటో వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ స్కూటర్‌ను పుణె, బెంగళూరు, నాగ్‌పుర్‌, మైసూరు, మంగళూరు, ఔరంగాబాద్‌, చెన్నైలలో మాత్రమే విక్రయిస్తోంది. నాలుగు రంగుల్లో, మూడేళ్ల బ్యాటరీ వారెంటీతో చేతక్‌ ఇ-స్కూటర్‌ను అందిస్తున్నట్లు, ప్రారంభ ధర రూ.1.44 లక్షల నుంచి ఉన్నట్లు బజాజ్‌ ఆటో పేర్కొంది. చేతక్‌ ఇ-స్కూటర్‌ బ్యాటరీ 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్‌ అవుతుంది. ఒకసారి ఛార్జింగుతో 90 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు.