రూ. 1999కే జియో 4జీ స్మార్ట్‌ఫోన్ పొందొచ్చు
జియో, గూగుల్‌తో కలిసి తీసుకొస్తున్న జియోఫోన్ నెక్ట్స్ దీపావళికి విడుదల అవుతోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను జియో ఇవాళ వెల్లడించింది. జియోఫోన్ నెక్ట్స్ ధర రూ.6,499గా ప్రకటించింది. అయితే రూ.1,999 చెల్లించి కూడా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయొచ్చు. మిగిలిన మొత్తాన్ని 18లేదా 24 నెలల వ్యవధిలో వాయిదా పద్ధతి (ఈఎంఐ)లో చెల్లించవచ్చని జియో వెల్లడించింది. ఇందుకోసం జియో నాలుగు వాయిదా పద్ధతులను ప్రకటించింది. ఇందులో రీఛార్జి ప్లాన్లు కలిపి ఉంటాయి.
మొదటిది అల్వేస్-ఆన్ ప్లాన్ (Always-on Plan). ఇందులో 18 నెలల కాలవ్యవధికి నెలకు రూ. 350 లేదా 24 నెలల కాలానికి నెలకు రూ.300 చొప్పున చెల్లించొచ్చు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు నెలకు 5జీబీ డేటాతోపాటు 100 నిమిషాల టాక్‌టైమ్ ఇస్తారు.
రెండోది లార్జ్ ప్లాన్ (Large Plan). ఈ ప్లాన్ కింద కస్టమర్స్ 18 నెలల వ్యవధిలో నెలకు రూ. 500 లేదా 24 నెలలకు నెలకు రూ.450 చొప్పున చెల్లించొచ్చు. ఇందుకు రోజుకు 1.5జీబీ 4జీ డేటాతోపాటు అపరిమిత వాయిస్ కాల్స్ ఉంటాయి.
మూడోది ఎక్స్ఎల్ ప్లాన్ (XL Plan). ఇందులో 18 నెలల కాలానికి నెలకు రూ.550 లేదా నెలకు రూ.500 చొప్పున 24 నెలలపాటు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు రోజూవారీ 2జీబీ హై-స్పీడ్ 4జీ డేటాతోపాటు అపరిమిత వాయిస్ కాల్స్‌ను పొందుతారు.
నాలుగోది ఎక్స్ఎక్స్ఎల్ ప్లాన్ (XXL Plan). ఈ ప్లాన్ కింద ఫోన్ కొనుగోలు చేసిన యూజర్స్ 18 నెలల కాలానికి నెలకు రూ. 600 లేదా 24 నెలల కాల వ్యవధికి నెలకు రూ.550 చొప్పున చెల్లించొచ్చు. ఇందుకు యూజర్స్ ప్రతిరోజూ 2.5 జీబీ 4జీ డేటాతోపాటు అపరిమిత వాయిస్‌కాల్స్ పొందుతారు.