ఇక ట్వీట్‌ను ఎడిట్ చేసుకోవచ్చు
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఈనెలలోనే ఎడిట్ (Edit) ఫీచర్‌ను ప్రవేశ పెట్టనుంది. ఈ ఫీచర్ డెవలప్మెంట్ స్టేజ్‌లో ఉందంటూ ఇన్నాళ్ళూ వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ నెలలో ఎంపిక చేసిన యూజర్లకు దీన్ని పరిచయం చేయనుంది. ప్రస్తుతం మన ఒక ట్వీట్ చేస్తే… దాన్ని ఎడిట్ చేయలేదు. ఏవైనా అక్షర దోషాలు ఉంటే… సవరిస్తూ మరో ట్వీట్ చేయడం లేదా పొరపాటు ఏదో మరో ట్వీట్ చేయడం తప్ప.. ఒరిజినల్ ట్వీట్‌ను ఏం చేయలేదు. ఇపుడు ఎడిట్ ఆప్షన్ ఇస్తోంది. కంపెనీలో అంతర్గతంగా దీన్ని విజయవంతంగా వాడినట్లు తెలుస్తోంది. బ్లూ యూజర్స్‌కు ఎడిట్ ఆప్షన్ కొన్ని వారాల్లోనే అందించనుందని వార్తలు వస్తున్నాయి. తాజా ఆప్షన్‌తో ఒక ట్వీట్ చేసిన తరవాత 30 నిమిషాల్లో సదరు ట్వీట్‌ను ఎడిట్ చేయాలని అనుకుంటే చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. 30 నిమిషాల తరవాత దాన్ని ఎడిట్ చేసే అవకాశం ఉండదు.