For Money

Business News

ఎస్‌ బ్యాంక్‌ నికర లాభం రూ.314 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎస్‌ బ్యాంక్ రూ.314.14 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే బ్యాంక్‌ నికర లాభంతో పోలిస్తే ఇది 54 శాతం పెరిగింది. ఇక స్టాండలోన్ ప్రాతిపదికన చూస్తే నికర లాభం రూ.206.84 కోట్ల నుంచి రూ.310.63 కోట్లకు చేరింది. కాని ఇంతకుమునుపు త్రైమాసికం (జనవరి-మార్చి మధ్య)లో వచ్చిన నికర లాభం రూ.367.46 కోట్లతో పోలిస్తే తక్కువ. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన నికర వడ్డీ ఆదాయం 32 శాతం పెరిగి రూ.1,850 కోట్లకు చేరినట్లు బ్యాంక్‌ తెలిపింది. వడ్డీయేతర ఆదాయం 10 శాతం తగ్గి రూ.781 కోట్లకు క్షీణించింది. నిరర్థక ఆస్తులు రూ .2.233 కోట్ల నుంచి రూ .1,072 కోట్లకు తగ్గాయి. ఇక బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు (జీఎఎన్‌పీఏలు) 13.4 శాతంగా నమోదయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 15 శాతం చొప్పున రుణ వృద్ధి సాధిస్తామని బ్యాంక్ ఎండీ, సీఈఓ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. జూన్‌ త్రైమాసికంలో రిటైల్ రుణాల్లో 42 శాతం వృద్ధి నమోదైందని ఆయన తెలిపారు.