For Money

Business News

ఎగిరే బైక్‌ వచ్చేసింది

గత ఏడాది జపాన్‌ మార్కెట్‌లో విడుదలైన హోవర్‌ బైక్‌ అంటే ఎగిరే బైక్‌ ఇపుడు అమెరికా మార్కెట్‌లోకి వచ్చింది. ప్రస్తుతం మిచిగాన్‌లో జరుగుతున్న డెట్రాయిట్‌ ఆటో షోలో ఈ బైక్‌ను జపాన్‌కు చెందిన Xturismo కంపెనీ పరిచయం చేసింది. ఈ బైక్‌ను AERWINS Technologies అనే జపాన్‌ స్టార్టప్‌ అభివృద్ధి చేసింది. పెట్రోల్‌తో నడిచే ఈ బైక్‌ గంటకు 99.8 కి.మీ. అంటే గంటకు 62 మైళ్ళు వేగంతో పయనిస్తుంది. అయితే గాలిలో కేవలం 40 నిమిషాలు మాత్రమే ప్రయాణం చేస్తుంది. ఆ తరవాత మళ్ళీ పెట్రోల్‌ పోయించుకుని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ బైక్‌ను
7.77 లక్షల డాలర్ల (అంటే రూ.6 కోట్లు)కు విక్రయిస్తున్నారు. ఇప్పటికే 20 బైక్‌లకు ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ అంటోంది. వచ్చే ఏడాది ఆరంభంలో అమెరికా మార్కెట్‌లో ఈ బైక్‌ను విక్రయిస్తామన్నారు. ప్రస్తుతం ఈ బైక్‌ నడుపుతున్నపుడు శద్దం కాస్త ఎక్కువ వస్తోందని… అయితే మార్కెట్‌లో కమర్షియల్‌ పద్ధతిలో విక్రయించే సమయానికి శబ్దం బాగా తగ్గుతుందని కంపెనీ తెలిపింది. ఎలక్ట్రిక్‌ గ్యాసోలిన్‌ హైబ్రిడ్‌ కవాసాకి ఇంజిన్‌తో ఈ బైక్‌ నడుస్తోంది. ఈ బైక్‌ బరువు మొత్తం 299 కిలీలు.రెండు మూడేళ్ళలో చిన్న, ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ను తీసుకు వస్తామని.. అపుడు ఈ బైక్‌ ధర 50,000 డాలర్లు ఉండొచ్చని తెలిపారు. అంటే రూ. 40 లక్షలకు లభిస్తుందన్నమాట. ఒక్కసారి ఇలాంటి బైక్‌ మార్కెట్‌లోకి వచ్చిందంటే… దీనికి బెటర్‌ వెర్షన్‌ చాలా వచ్చే అవకాశముంది. ఇలా ఆకాశంలో ఎగిరే బైక్స్‌ కోసం దాదాపు 300 కంపెనీలు కృషి చేస్తున్నారు. దీని వల్ల మరింత ఎక్కువ సమయం గాలిలో ప్రయాణించే వీలు ఉన్ బైక్స్‌ రావడం ఖాయం. అలాగే ధర కూడా తగ్గే అవకాశముంది.

https://www.youtube.com/watch?v=1H0SP85EcBA