టోకు ధరల సూచీ 13.11 శాతం
వరుసగా 11వ నెల కూడా టోకు ధరల ద్రవ్యోల్బణ సూచీ (WPI) 10 శాతంపైనే ఉంది. జనవరి నెలలో 12.96 శాతం ఉన్న ఈ సూచీ ఫిబ్రవరిలో 13.11 శాతానికి చేరింది. గత ఏడాది ఫిబ్రవరిలో WPI 4.83 శాతం ఉండేది. ఆహార పదార్థాల ధరలు భారీగా పెరగడం వల్లే టోకు ధరలు ద్రవ్యోల్బణ సూచీ పెరిగింది. WPI బాగా పెరిగినందున వినియోగదారుల ద్రవ్యోల్బణ సూచీ కూడా పెరగడం సాధారణమే. ఆర్బీఐ అంచనాల ప్రకారం వినియోగదారుల సూచీ నాలుగు శాతం (రెండు శాతం ఎక్కువ లేదా తక్కువ) ఉంటుందని అంచనా వేసింది.అయితే జనవరి నెలలో వినియోగదారుల ద్రవ్యోల్బణ సూచీ 6 శాతం దాటింది.