21 నెలల కనిష్ఠానికి టోకు ధరల సూచీ
దేశంలో టోకు ధరల ద్రవ్యోల్బణం 21 నెలల కనిష్ఠానికి చేరింది. నవంబర్ నెలలో 5.85 శాతంగా నమోదైనట్లు ఎన్ఎస్ఓ పేర్కొంది. ముఖ్యంగా ఆహార పదార్థాలు, చమురు, తయారీ వస్తువుల ధరలు తగ్గడమే దీనికి కారణం. ఈ సూచీ గడచిన 19 నెలలుగా రెండంకెల సంఖ్య పైనే నమోదవుతూ వస్తోంది. అక్టోబర్లో తొలిసారి 8.39 శాతానికి తగ్గిందని ఎన్ఎస్ఓ పేర్కొంది. గతేడాది నవంబర్లో 14.87 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం తాజాగా 5.85 శాతానికి చేరింది.