For Money

Business News

44,000 పైన బ్యాంక్‌ నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి సూచించిన స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 18671ని తాకిన నిఫ్టి … ఇపుడు 18658 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 50 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టిలో 45 షేర్లు లాభాల్లో ఉన్నా… చాలా వరకు షేర్లు నామమాత్రపు లాభాల్లో ఉన్నాయి. మెటల్‌, ఐటీ షేర్లు ఇవాళ వెలుగులో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టి తొలిసారి 44000 స్థాయిని దాటింది. 44082 పాయింట్లను తాకిన బ్యాంక్‌ నిఫ్టి ఇపుడు 44042 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక షేర్ల విషయానికొస్తే పేటీఎం షేర్‌ క్రితం ముగింపు వద్దే ఉంది. బై బ్యాక్‌ను మార్కెట్‌ పట్టించుకోలేదు. ఈ షేర్‌ నష్టాల్లోకి జారుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఇక నిఫ్టిలో మెటల్‌, ఐటీ షేర్లు ఉన్నాయి. నిఫ్టి నెక్ట్స్‌లో కూడా మెటల్స్‌, ఐటీ షేర్ల హవా నడుస్తోంది. ఇవాళ యాక్టివిటీ అధికంగా మిడ్‌ క్యాప్‌ షేర్లలో ఉంది. మిడ్‌ క్యాప్‌ ఐటీ షేర్లకు గట్టి మద్దతు లభించవచ్చు. ఇక బ్యాంకుల విషయానికొస్తే పీఎన్‌బీ బ్యాంకును కట్టడి చేయడం కష్టంగా ఉంది. ఇవాళ కూడా ఈ షేర్‌ ఒక శాతం లాభంతో ఉంది. దాదాపు మిడ్ క్యాప్‌ బ్యాంకు షేర్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి.