For Money

Business News

విప్రో 25,000 నియామకాలు

ఐటీ రంగంలో అట్రిషన్‌ రేటు (వలసల రేటు) అధికంగా ఉంది. అనేక మంది ఉద్యోగులు తామున్న ఉద్యోగాలను వొదిలి మరో కంపెనీకి మారుతున్నారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో విప్రో కంపెనీలో ఉద్యోగాలు మారిన ఉద్యోగుల సంఖ్య 20.5 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధిక సంఖ్యలో కొత్తవారిని కంపెనీ తీసుకొంటోంది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెల్లో కంపెనీకి చెందిన వివిధ క్యాంపస్‌లలో 8,100 మంది కొత్త వాళ్ళను తీసుకున్నారు. అంతకుముందు త్రైమాసికంలోని 15.5 శాతం శాతం ఉద్యోగాలు మారగా, తాజా త్రైమాసికంలో 20.5 శాతం మంది మానేశారు. తాజాగా 25,000 మందిని తీసుకోవాలని నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది.