For Money

Business News

జీతాల పెంపును ఆపిన విప్రో!

అమెరికా మాంద్య ప్రభావం క్రమంగా ఐటీ కంపెనీలపై పడుతోంది. అమెరికాలో టెక్‌ కంపెనీల షేర్లు భారీగా క్షీణించాయి. దాదాపు 30 శాతంపైగా తగ్గిన తరవాత స్వల్ప మద్దతు లభిస్తోంది. అయితే అమెరికా మార్కెట్లపై ఆధారపడిన విప్రో వంటి కంపెనీలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసానికి విప్రో కంపెనీ వేరియబుల్‌ జీతాల పెంపును ఆపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మధ్య స్థాయి, సీనియర్‌ ఉద్యోగులకు వేరియబుల్‌ పేను పూర్తిగా నిలిపేసింది. అయితే ఫ్రెషర్స్, దిగువ స్థాయిలో ఉద్యోగుల వేరియబుల్‌ పేలో కూడా 30 శాతం కోత విధించింది. కంపెనీ మార్జిన్‌ దెబ్బతినకుండా కంపెనీ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. విప్రో కంపెనీ చర్యలతో ఒక్కసారిగా ఐటీ రంగంలో అలజడి మొదలైంది. అధిక జీతాలతో ఐటీ ఉద్యోగుల కోసం పోటీ పడిన ఐటీ కంపెనీలు ఇపుడు స్పీడు తగ్గించే అవకాశముందని అంటున్నారు. విప్రో నిర్ణయంతో ఇతర కంపెనీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.