For Money

Business News

NIFTY TRADE: ఇపుడు నిఫ్టిని ఏం చేయాలి?

చాలా మందికి నిన్న వంద పాయింట్లకు పైగా ఛాన్స్‌ మిస్సయినట్లు బాధపడ్డారు. నిన్న కేబినెట్‌ నిర్ణయాలు మార్కెట్‌కు ముందే లీక్‌ కావడంతో నిఫ్టికి రోజంతా మద్దతు అందింది. అయితే చిన్న ఇన్వెస్టర్లు స్ట్రిక్‌ స్టాప్‌లాస్‌కు కట్టుబడి ఉండాలి. నష్టం వస్తే బయటపడాలి. నిఫ్టితో పోటీ పడితే… భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. ప్రపంచ మార్కెట్లన్నీ పడుతున్నాయి. చైనాతోపాటు ఆసియా మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మన మార్కెట్‌లో అమ్మకాలు కాస్త కష్టమే. అధిక స్థాయిలో నిఫ్టిని కొనుగోలు చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్నది. ఈ నేపథ్యంలో నిఫ్టి పెరిగినపుడు అమ్మడం.. స్వల్ప లాభాలతో బయటపడటం వినా మరో మార్గం లేదని మెజారిటీ అనలిస్టులు అంటున్నారు. నిఫ్టి క్రితం ముగింపు 17,519. నిఫ్టి ఇవాళ ఫ్లాట్‌గా ఓపెన్‌ అవుతుంది. వెంటనే ట్రేడ్‌ చేయొద్దు. వెయిట్‌ చేయండి. నిఫ్టి గనుక మద్దతు అందే పక్షంలో… టెలికాం, ఆటో ర్యాలీ కొనసాగే పక్షంలో… నిఫ్టి 17,570-17580 ప్రాంతానికి వస్తుందేమో చూడండి. వస్తే అమ్మండి. స్టాప్‌లాస్‌ 15 లేదా 20 పాయింట్లు. నిఫ్టి గనుక 17,595 దాటితే నష్టంతో బయటపడటం మంచిదని టెక్నికల్స్‌ చెబుతున్నాయి. ఎందుకంటే నిఫ్టి 17,600 లేదా 17,620ని దాటితే.. 17,690 వరకు పెద్దగా ఒత్తిడి లేదు. క్రూడ్‌ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో నిఫ్టిలో లాంగ్‌ పొజిషన్ రిస్కే. సో..అధిక స్థాయిలోఅమ్మండి. నిఫ్టి 17,500 దిగువకు వస్తే కచ్చితంగా 17,480 ప్రాంతానికి కూడా రావొచ్చు. వరుస కొనుగోళ్ళ కారణంగా నిఫ్టి ఇప్పటికే ఓవర్‌బాట్ పొజిషన్‌లో కొనసాగుతోంది.

నిన్న, ఇవాళ ప్రపంచ మార్కెట్‌ పరిణామాలను పాఠకులకు వివరించే ప్రయత్నం ఇది. టెక్నికల్‌ ఎలా ఉన్నాయో అనలిస్టుల అభిప్రాయం వివరించా. పెట్టుబడి పెట్టే ముందు ఇన్వెస్టర్లు సర్టిఫైడ్‌ ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మర్చిపోవద్దు.