For Money

Business News

NIFTY TODAY: 17800 కీలకం…

విదేశీ ఇన్వెస్టర్ల వ్యూహం సక్సెస్‌. గత కొన్ని రోజుల నుంచి 18000 కాల్‌ ఆప్షన్స్‌ను అమ్ముతూ వచ్చిన విదేశీ ఇన్వెస్టర్ల… మూడు సెషన్స్‌లో కేవలం నిఫ్టి షేర్లను క్యాష్‌ మార్కెట్‌లో కొనుగోలు చేసి నిఫ్టి 17900 క్రాస్‌ అయ్యేలా చేశారు. ఇవాళ నిఫ్టి కనీసం 150 పాయింట్లు క్షీణించే అవకాశముంది. అంటే భారీ రేట్లను అమ్మిన కాల్స్‌ ఆప్షన్స్‌ కాంట్రాక్ట్స్‌ను ఇపుడు చాలా తక్కువ ధరకు కొని… లాభపడనున్నారు. ఇక ఇవాళ్టి ట్రేడింగ్‌ విషయానికొస్తే… నిన్న నిఫ్టిలో అన్ని టాప్‌ లూజర్స్‌ ఐటీ షేర్లు. ఇవాళ కూడా అదే సీన్‌ మరింత గట్టిగా అమలు కానున్నాయి. గత పది నెలల్లో ఎన్నడూ లేనివిధంగా ఐటీ, టెక్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. కరోనా సమయంలో ఐటీ షేర్లు సేఫ్‌ అనుకున్నవారికి ఇది పెద్ద షాక్‌. ఇక ఇవాళ వీక్లీ నిఫ్టి డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కూడా. చూస్తుంటే నిఫ్టి చాలా ఈజీగా 17800 దిగువకు వెళ్ళే అవకాశముంది. నిఫ్టి బలంగా ముందుకు సాగాలంటే 17800పై ఉండాలి. కనీసం 17750 వద్ద నిలబడాలి. ఈ స్థాయిని నిఫ్టి తాకే అవకాశాలు అధికంగా ఉన్నాయి. 17,710 దిగువకు వెళితే నిఫ్టి భారీ పతనం ఖాయం. భారీ పతనం తరవాత కూడా అమెరికా ఫ్యూచర్‌ మార్కెట్లు గ్రీన్‌లోకి రాలేదు. యూరో మార్కెట్లు ఎలా స్పందిస్తాయో చూడాలి. అమెరికా ఫ్యూచర్స్‌ రెడ్‌లో ఉంటే… ట్రేడింగ్‌కు దూరంగా ఉండటమే బెటర్‌.