For Money

Business News

వీడియోకాన్‌ విక్రయం చెల్లదు

వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ను టేకోవర్‌ చేసుకోవడానికి ప్రయత్నించిన ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌కు షాక్‌ . కంపెనీ గెలిచిన ఈ బిడ్‌ను జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) రద్దు చేసింది. ఈ బిడ్‌ వల్ల బ్యాంకులకు రూ.62,000 కోట్ల నష్టం కల్గుతుందని కొందరు రుణదాతలు చేసిన విజ్ఞప్తి మేరకు ఎన్‌సీఎల్‌ఏటీ ఈ నిర్ణయం తీసుకుంది. వీడియోకాన్‌ విక్రయానికి మళ్లీ బిడ్‌లు పిలవాలని రుణదాతలను ఎన్‌సీఎల్‌ఏటీ కోరింది. రుణదాతలకు వీడియోకాన్‌ రూ.64,637.6 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీడియోకాన్‌ను స్వాధీనం చేసుకునేందుకు ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌ దాఖలు చేసిన రూ.2,962.02 కోట్ల ఆఫర్‌ను రుణదాతల్లో మెజారిటీ సభ్యులు ఆమోదించగా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర(బీఓఎమ్‌), ఐఎఫ్‌సీఐ వ్యతిరేకించాయి.