For Money

Business News

NIFTY TRADE: 17,800ని దాటగలదా?

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలో నిఫ్టి ప్రారంభం కావడమంటే నిఫ్టి తన ప్రతిఘటన స్థాయికి దగ్గర్ల్లో ప్రారంభంకావడమే. నిఫ్టి 15,800ని దాటితే 15,825వద్ద తొలి ప్రతిఘటనను ఎదర్కోవచ్చు. ఆసియా మార్కెట్ల ధోరణి చూస్తుంటే నిఫ్టి 15,825ని దాటడం కష్టంగా ఉంది. సో.. దీన్నే స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మొచ్చు. 15,825ని దాటితే నిఫ్టిని అమ్మొద్దు. ఎందుకంటే ఈ స్థాయిని దాటితే నిఫ్టికి 15,875, 15,925 వరకు ఎలాంటి ప్రతిగఘటన లేదు. కాబట్టి 15,825 స్టాప్‌లాస్‌ అమ్మి వెయిట్‌ చేయండి. 15,777కి పడుతుందేమో చూడండి. పడితే ఇంకా వెయిట్‌ చేయండి. 15,766కి చేరితే అమ్మకాల ఒత్తిడి రావొచ్చు. ఎందుకంటే ఆ తరవాత నిఫ్టికి 15,700 వరకు మద్దతు లేదు. సో… మీ రిస్క్‌ను బట్టి లాభాలు ఎక్కడ తీసుకోవాలో నిర్ణయించుకోండి. నిఫ్టిలో భారీ అమ్మకాలు ఊహించకండి. నిఫ్టి ఇపుడు ఓవర్‌ సోల్డ్‌ జోన్‌లో ఉంది. పడినపుడల్లా నిఫ్టికి మద్దతు అందే అవకాశముంది. పొజిషనల్‌ ట్రేడర్స్‌ 15,700 లేదా 15,680 ప్రాంతంలో కొనుగోలు చేయొచ్చు. ఇవాళ ట్రేడ్‌ చేసేవారు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇవాళ అమెరికా మార్కెట్లకు సెలవు. పైగా అమెరికా ఫ్యూచర్స్‌ నష్టాల్లో ఉన్నాయి. యూరో మార్కెట్లకు రియాక్టయిన తరవాత నిఫ్టిలో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. డాలర్‌, క్రూడ్‌ ధరల దృష్ట్యా అధిక ధరల్లో అమ్మి.. స్వల్ప లాభాలతో బయటపడండి. పొజిషనల్‌ ట్రేడర్స్‌ ఇదివరకే కొని ఉంటే పొజిషన్స్‌ కొనసాగించవచ్చు. నిఫ్టి పడినపుడు యాడ్‌ చేసుకోవచ్చు. డే ట్రేడర్స్‌కు కొనుగోళ్ళు అనవసరం