For Money

Business News

NIFTY TODAY: 18022 లేదా?

నిఫ్టి ఇవాళ కీలక పరీక్షను ఎదుర్కోనుంది. అంతర్జాతీయ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో కూడా అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. అయినా అమెరికా ప్యూచర్స్‌ రెడ్‌లో ఉన్నాయి. ఇక మన మార్కెట్ల విషయానికొస్తే… నిఫ్టి క్రితం ముగింపు 18,113. సింగపూర్‌ నిఫ్టి 30 పాయింట్ల నష్టంతో ఉంది.. నిఫ్టి ఇదే స్థాయి నష్టంతో ప్రారంభమౌతుందా అన్నది చూడాలి. ఇక ఇవాళ్టి ట్రేడింగ్‌కు దిగువ స్థాయి లెవల్స్‌ను గమనించండి.

నిఫ్టి తొలి మద్దతు 18022
రెండో మద్దతు 17994
డౌన్‌ బ్రేకౌట్‌ 17950
బేర్‌ మార్కెట్‌ 17830

నిఫ్టి 18000పైన ఉన్నంత వరకు ఢోకా లేదని ఇన్నాళ్ళూ అనలిస్టులు చెబుతూ వచ్చారు. ఇపుడు ఆ స్థాయిని నిఫ్టి కాపాడుకుంటుందా అనేది చూడాలి. లేనిపక్షంలో నిఫ్టి బడ్జెట్‌ ముందు అమ్మకాలకు రెడీ అవ్వొచ్చు. అయితే చిన్న ఇన్వెస్టర్లు మాత్రం ప్రస్తుత స్థాయిలో కొనుగోలు చేయొద్దు.