For Money

Business News

మార్కెట్లు ఎందుకు పడుతున్నాయి?

అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలుఉ జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో భారీగా పెరిగిన టెక్నాలజీ, ఐటీ షేర్లలో తీవ్ర ఒత్తిడి వస్తోంది. కరోనా తగ్గుముఖం సంగతేమోగాని… ఒమైక్రాన్‌ వల్ల ప్రాణాలకు ముప్పు తక్కువేనని తేలడం… అమెరికా ఆర్థిక గణాంకాలన్నీ పాజిటివ్‌గా వస్తుండటంతో మార్చి నెల నుంచి అమెరికాలో వడ్డీ రేట్లు పెరగనున్నాయి. అమెరికా ఆర్థికంగా చాలా బలంగా ఉందన్నవార్తలతో డాలర్‌ పెరుగుతోంది. బాండ్స్‌పై ఈల్డ్‌ పెరుగుతున్నాయి. మార్కెట్‌లను ఇపుడు బాగా ప్రభావితం చేస్తున్నది బాండ్స్‌పై ఈల్డ్‌. ఇవి పెరగడం వల్ల ఇప్పటి వరకు ఇతర మార్కెట్లకు తరలిని పెట్టుబడులు… మళ్ళీ అమెరికాకు వెనక్కి వస్తాయి. అనూహ్యంగా చైనా తీసుకున్న నిర్ణయం ఇపుడు ఆ దేశానికి బాగా కలిసివచ్చింది. కావాలని కొన్ని రంగాలపై చైనా చావు దెబ్బతీసింది. ఆ పరిశ్రమలన్నీ ఆకాశం నుంచి నేల మీదకు వచ్చాయి. వృద్ధి రేటు బాగా పడిపోయింది. ఈ సమయంలో చైనా వడ్డీ రేట్లను తగ్గింది. ప్రపంచం మొత్తం వడ్డీ రేట్లను పెంచే సమయంలో… చైనా తగ్గించడం ప్రారంభమైంది. దీంతో క్రూడ్‌ ధరలు బాగా పెరగడం ప్రారంభమైంది. భారత్‌ వంటి పలు వర్థమాన మార్కెట్లకు మైనస్‌గా మారుతోంది. ఏడాది నుంచి మన మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు అమ్ముతూనే ఉన్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతున్నందున ఈక్విటీ షేర్లు పడుతున్నాయి. చైనాలో వడ్డీ రేట్లు తగ్గితే..దాని ప్రభావం మన మార్కెట్లపై పడే అవకాశముంది. మరి కరెన్సీ, బాండ్‌ ఈల్డ్స్‌ను మార్కెట్‌ ఎప్పటి దాకా డిస్కౌంట్ చేస్తుందనే అంశంపై ఇపుడు మార్కెట్‌లో చర్చ జరుగుతోంది. దీనిపై మార్కెట్‌లో ఓ అవగాహన కుదిరే వరకు మార్కెట్‌లో భారీ పతనం లేకున్నా… భారీ ర్యాలీ మాత్రం కష్టమని విశ్లేషకులు అంటున్నారు.