NIFTY TODAY: పడితే కొనొచ్చా?
ఇపుడు చాలా మంది ఇన్వెస్టర్లను వేధిస్తున్న ప్రశ్న. రాత్రి వాల్‌స్ట్రీట్ ట్రెండ్ చూసిన తరవాత.. అలాంటి రకవరీ మన మార్కెట్లలో కూడా వస్తుందా అన్న ఆశ ఇన్వెస్టర్లలో కన్పిస్తోంది. రాత్రి అమెరికా మార్కెట్లు పెరిగినా.. ఉదయం నుంచి అమెరికా ఫ్యూచర్స్ మళ్ళీ నష్టాల్లో ఉండటంతో పాటు ఫెడ్ మీటింగ్ అనిశ్చితి మార్కెట్‌ను వెంటాడుతోంది. ఉదయం నుంచి అన్ని ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. మన మార్కెట్లు కూడా నష్టాల్లో ప్రారంభం కానున్నాయి. ఇక ఇవాళ్టి ట్రేడింగ్ విషయానికొస్తే… నిఫ్టి క్రితం ముగింపు 17,149. నిఫ్టి నిన్న 17000 దిగువకు వెళ్ళింది. బహుశా మళ్లీ నిఫ్టి ఆ స్థాయికి చేరొచ్చు. నిఫ్టి ప్రస్తుతం ఓవర్ సోల్డ్ జోన్లో ఉంది. రేపు మార్కెట్లకు సెలవు. ఎల్లుండి మార్కెట్లు ప్రారంభమయ్యే సమయానికి ఫెడ్ రేట్ల నిర్ణయం వెలువడి ఉంటుంది. అలాగే ఎల్లుండి ఈ నెల వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉంది. రోల్కోస్టర్ వీక్. ఓవర్‌సోల్డ్ జోన్లోఉన్న నిఫ్టికి ఎక్కడ మద్దతు అందుతుందనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉండటం మంచిది. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు దిగువ లెవల్స్ చూసి ట్రేడ్చేయొచ్చు.
నిఫ్టికి కీలక మద్దతు 16,961
రెండో మద్దతు 16,894
డౌన్ బ్రేకౌట్… 16791
నిఫ్టికి ఎక్కడైనా మద్దతు లభిస్తే 17255 దాకా నిఫ్టి వెళ్ళే అవకాశముంది. కాని తొలి ప్రతిఘటన ఎదురయ్యేది మాత్రం 17330 ప్రాంతంలోనే. సో…మద్దతు స్థాయికి, ఒత్తిడికి మధ్య గ్యాప్ చాలా ఉంది. కాబట్టి దిగువస్థాయిలో కొనేవారు కచ్చిత స్టాప్‌లాస్‌తో కొనండి. ఉక్రెయిన్ యుద్ధం వల్ల క్రూడ్‌తో పాటు డాలర్ తీవ్రంగా స్పందిస్తాయి.