For Money

Business News

NIFTY TRADE: అప్పటి దాకా అనుమానమే?

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే… దేశీయ ఆర్థిక సంస్థలు మార్కెట్‌కు దూరంగా ఉండటం వినా… ఏమీ చేయలేని పరిస్థితి. ఫ్యూచర్స్‌, క్యాష్‌ మార్కెట్‌లో భారీ అమ్మిన విదేశీ ఇన్వెస్టర్లు ఇండెక్స్‌ ఆప్షన్స్‌లో మాత్రం కొంటున్నారు. గతంలో 18000 మార్కెట్‌కు గట్టి బేస్‌ ఉండగా ఇపుడు ఆ స్థాయి 17400 లేదా 17500కు చేరిందని అనలిస్ట్‌ వీరందర్‌ కుమార్‌ అంటున్నారు. ఇవాళ కూడా నిఫ్టి నిన్నటి కనిష్ఠ స్థాయిని తాకే అవకాశముందని అంటున్నారు. అయితే 17000 మార్కెట్‌కు కీలకంగా మారే అవకాశముంది. 17200 లేదా 17231 దాటితేకాని నిఫ్టి కోలుకోవడం కష్టమని అంటున్నారు. వీరేందర్‌ ప్రకారం నిఫ్టి పడితే 16963 లేదా 16910 ప్రాంతంలో మద్దతు అందే అవకాశముంది. పెరిగితే 17200 లేదా 17231 లేదా 17289 వద్ద ప్రతిఘటన వస్తుందని ఆయన సలహా ఇస్తున్నారు. మార్కెట్‌కు రేపు హాలిడే ఉండటం, ఎల్లుండి డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉన్నందున ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ట్రేడ్‌ చేయాలని అంటున్నారు. బ్యాంక్‌ నిఫ్టి, ఇతర లెవల్స్‌ కోసం దిగువ వీడియో చూడగలరు.