NIFTY TODAY: దిగువస్థాయిలో మద్దతు?
మార్కెట్ ఇవాళ కూడా నష్టాల్లో ప్రారంభం కానుంది. ఒమైక్రాన్ దెబ్బకు ప్రపంచ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గతున్నాయి. ఆసియా మార్కెట్ల పతనం మధ్య నిఫ్టి కూడా ఒకమోస్తరు నష్టాలతో ప్రారంభం కానుంది. సింగపూర్ నిఫ్టి ట్రెండ్ చేస్తూ నిఫ్టి వంద పాయింట్ల నష్టంతో ట్రేడయ్యే అకవాశముంది. ఇక డే ట్రేడింగ్ విషయానికొస్తే… నిఫ్టి క్రితం ముగింపు 16,985. ఓపెనింగ్‌లో నిఫ్టి 16880 దిగువన ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ నెలలో అయిదు వారాలు రావడంతో డెరివేటివ్స్ ముగింపు వచ్చేవారం. కాబట్టి ఈ వారం దిగువ స్థాయిలో నిలదొక్కుకుంటుందా అన్నది చూడాలి. ఎందుకంటే నాస్డాక్ స్థిరంగా ముగియడం చూస్తుంటే గత శుక్రవారం మాదిరి ఇవాళ కూడా నిఫ్టికి ఐటీ షేర్లను మద్దతు అందాలి. విదేశీ ఇన్వెస్టర్లు వరసుగా అమ్ముతున్న నేపథ్యంలో దేశీయ ఇన్వెస్టర్లు మార్కెట్‌కు అండగా నిలుస్తారనేది చూడాలి. నిఫ్టికి వెంటనే మద్దతు 16878. అంటే ఓపెనింగ్‌లోనే నిఫ్టి తొలి మద్దతు స్థాయికి చేరుకుంటుంది. నిఫ్టికి ఇక్కడ మద్దతు లభిస్తుందేమో చూడండి. ఎందుకంటే తదుపరి మద్దతు స్థాయి 16840. నిఫ్టి ఇప్పటికే ఓవర్ సోల్డ్ జోన్లోకి వెళ్ళింది. రిస్క్ తీసుకునేవారు 16,840 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. నిఫ్టి పెరిగితే 17,000 దాటాలి. ఈ స్థాయిని దాటితే నిఫ్టి 17070 ప్రాంతానికి చేరే అవకాశముంది. సింగపూర్ నిఫ్టి స్థాయిలో నిఫ్టి పడితే… స్ట్రిక్ట్ స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేసి … స్వల్ప లాభంతో బయటపడండి. అమెరికా ఫ్యూచర్స్ భారీ నష్టాల్లో ఉండటంతో నిఫ్టి క్రితం ముగింపు స్థాయికి చేరుతుందా అనేది చూడాలి. యూరో మార్కెట్లు కూడా నష్టాల్లో ప్రారంభమయ్యే పక్షంలో నిఫ్టిలో ఒత్తిడి వస్తుంది. కాబట్టి నిఫ్టిని కొనేపక్షంలో… స్ట్రిక్ట్ స్టాప్‌లాస్ పాటించండి. అధిక లాభాల కోసం ఎదురు చూడొద్దు.
నిఫ్టికి మధ్య కాలిక తాజా మద్దతు స్థాయి 16,782.
నిఫ్టి ఓపెనింగ్ తరవాత ఏమాత్రం పెరిగినా అమ్మడానికి ఛాన్స్‌గా భావించవచ్చని ప్రముఖ స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు సుదర్శన్ సుఖానీ ఇవాళ సీఎన్‌బీసీ టీవీ18 ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు. నిఫ్టి బేరిష్ ధోరణిలోఉందని, కొనుగోలుచేయమని తాను సలహా ఇవ్వనని చెప్పారు.