For Money

Business News

NIFTY TRADE: పెరిగితే అమ్మడమే…

నిన్న నిఫ్టి భారీగా పెరిగింది. చాలా మంది ఓపెనింగ్‌లో కొనలేకపోయామనే బాధపడుతుంటారు. కాని నిన్న క్లోజింగ్‌లో అమ్మినవారు ఇవాళ భారీ లాభాలు మూటగట్టుకోనున్నారు. ప్రపంచ మార్కెట్లను చూస్తుంటే… నిఫ్టి విషయంలో చాలా ఓపిక అవసరం. అధిక స్థాయిల్లో నిఫ్టి మరింత ముందుకు సాగడం కష్టం. విదేశీ ఇన్వెస్టర్లు, దేశీయ ఇన్వెస్టర్లు నిన్న కొనుగోలు చేయడంతో నిఫ్టి భారీగా పెరిగింది. కాని అమెరికా, ఆసియా మార్కెట్లలో పరిస్థితి చూస్తుంటే… నిఫ్టిని అధిక స్థాయిలో అమ్మడమే సరైన వ్యూహంగా కన్పిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొనాలన్నా, అమ్మాలన్నా కచ్చిత స్టాప్‌లాస్‌తో చేయడం. ఇక ఇవాళ్టి నిఫ్టి ట్రేడింగ్‌ వ్యూహం విషయానికొస్తే… నిఫ్టి ఇవాళ 17,600 ప్రాంతంలో ప్రారంభం కావొచ్చు. ఇవాళ్టి ట్రేడింగ్‌కు 17,660 కీలక స్థాయి. దీని దిగువన ఉన్నంత వరకు నిఫ్టి బలహీనంగా ఉంటుంది. ఈ స్థాయిని దాటితే నిఫ్టి దాదాపు వంద పాయింట్లు పెరిగే అవకాశముంది. మరి ఆ ఛాన్స్‌ ఇవాళ వస్తుందా అన్నది చూడాలి. సో… పై స్థాయిలో నిఫ్టి ఎక్కడికి వెళుతుందనేది చూడండి. 17,700 ప్రాంతంలో అంటే నిన్నటి క్లోజింగ్‌కు వెళితే… స్ట్రిక్ట్‌ స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చు. ఇక దిగువ స్థాయిలో నిఫ్టి 17,600 ప్రాంతానికి వస్తుందేమో చూడండి. రిస్క్ తీసుకునే వారు 17,590 లేదా 17,580 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయొచ్చు. యూరోపియన్‌ మార్కెట్లను గమనించండి.