For Money

Business News

NIFTY TRADE: ఆగని విదేశీ అమ్మకాలు

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు జోరుగానే ఉన్నాయి. ఎక్కడా తగ్గడం లేదు. రోజూ కనీసం రూ.5000 కోట్ల నికర అమ్మకాలు సాగుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల వ్యాపారం ఎక్కువగా ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌లో ఉంటోది. ఈ మార్కెట్‌లో వీరు నిన్న రూ. 4,685 కోట్లు ఖర్చు పెట్టారు. సీఎన్‌బీసీ ఆవాజ్‌కు చెందిన వీరేందర్‌ అంచనా ప్రకారం నిఫ్టి ఇవాళ 17064, 17155 వద్ద ఒత్తిడి ఎదురు కానుంది. సూచీ దూసుకుపోయే పక్షంలో ఒత్తిడి 17,205. 17,250 వద్ద ఎదురు కావొచ్చు. పడే పక్షంలో నిఫ్టికి తొలి మద్దతు 16,910, 16,854 ప్రాంతంలో లభించవచ్చు. బ్యాంక్‌ నిఫ్టి కోసం వీడియో చూడండి.

https://www.youtube.com/watch?v=m-eCLbRZ5gA