For Money

Business News

NIFTY TODAY: 17,080 కీలకం

ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు ఒమైక్రాన్‌ అనిశ్చితిలో కొనసాగుతున్నాయి. రాత్రి రెండు శాతం దాకా క్షీణించిన అమెరికా మార్కెట్లు ఇపుడు గ్రీన్‌లో ఉన్నాయి. మరి నిఫ్టి ఏం చేస్తుందనేది కీలకం. సింగపూర్ నిఫ్టి 90 పాయింట్ల లాభం చూపుతోంది. మరి నిఫ్టి ఇవాళ్టి ట్రేడ్‌ ఎలా ఉంటుంది? నిఫ్టి క్రితం ముగింపు 16,983. సింగపూర్ నిఫ్టి మాదిరిగా గ్రీన్‌లో నిఫ్టి ప్రారంభమైతే 17,050 స్థాయిని ఓపెనింగ్‌లోనే దాటేయనుంది. నిఫ్టికి ఇవాళ కీలక స్థాయి 17,080. ఈ స్థాయిని దాటితే నిఫ్టిపై ఒత్తిడి రానుంది. 17,110 వద్ద తొలి ప్రతిఘటన, 17150 రెండో ప్రతిఘటన ఎదురు కానుంది. ఈ స్థాయిల్లో ఇన్వెస్టర్లు స్వల్ప స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చు.అయితే స్టాప్‌లాస్‌ను దాటితే ట్రేడ్‌ చేయొద్దు. ఎందుకంటే నిఫ్టి 17,200 దాటితే 17,400 వరకు ఒత్తిడి లేదు. కాబట్టి అమ్మేటపుడు స్టాప్‌లాస్‌ జాగ్రత్త. కాని ఆ స్థాయి మద్దతు లభిస్తుందా అన్నది అనుమానమే. కాబట్టి 17,150 ప్రాంతంలో షార్ట్‌ చేసే అంశాన్ని ఆలోచించవచ్చు. ఇక నిఫ్టి పడితే… అంటే 17,080 దిగువకు చేరితే వెంటనే క్రితం ముగింపునకు అంటే 16,983కి చేరనుంది. మద్దతు మాత్రం 16,860 వరకు లేదు. ఆల్గో ట్రేడింగ్‌ లెవల్స్‌ మధ్య గ్యాప్‌ చాలా ఎక్కువగా ఉంది. 16,860-17,100 లెవల్స్‌ మధ్య నిఫ్టి కదలాడే అకవాశముంది.