మూడోసారి కోలుకుంటుందా?
స్టాక్ మార్కెట్ తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటోంది. దేశీయంగా మార్కెట్‌ను బూస్ట్ చేసే అంశాలు దాదాపు లేవు. అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్ చూస్తే బీజేపీకి పరాభవం తప్పలా లేదు. ఇక అంతర్జాతీయ పరిస్థితులను చూస్తే.. ఉక్రెయిన్ పరిస్థితి చూస్తుంటే… క్షణక్షణం టెన్షన్ పెరుగుతోంది. డాలర్‌తో పాటు క్రూడ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు లభిస్తుందా అన్న చర్చ ఇపుడు మార్కెట్‌లో జరుగుతోంది. శుక్రవారం నిఫ్టి 17,276 వద్ద్ ముగిసింది. పెరిగితే 17500-17550 పాయింట్ల వద్ద గట్టి ప్రతిఘటన వచ్చేలా ఉంది. అలాగే దిగువ స్థాయలో 17000-16850 వద్ద మద్దతు అందచచ్చు. గడచిన మూడు నాలుగు వారాల్లో నిఫ్టి ఈ స్థాయికి చేరి కోలుకుంది. మరి మూడోసారి ఆ స్థాయికి పడితే కోలుకుంటుందా అన్న అంశంపై టెక్నికల్ అనలిస్టుల్లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.